- గ్యాస్ ధరల పెంపుపై మండిపడ్డ నేతలు
- తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
ఆల్విన్ కాలనీ డివిజన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ ఆరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, ఐడీపీఎల్ చౌరస్తాలో రెండో రోజుప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి .నల్లగొండ క్లాక్ టవర్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మహా ధర్నాను ప్రారంభించారు. కుమ్రంభీం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, పలు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు .పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్లతో మహా ధర్నా నిరసన కార్యక్రమం.. చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకు ంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రభుత్వం వెంటనే గ్దదె దిగాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ధర్నాలు నిర్వహించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు. కంటోన్మెంట్లోని ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్లోకి అనుమతించడంలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరయిందని చెప్పారు.
కంటోన్మెంట్లో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరిగేదని, నేడు ప్రతినిత్యం నీరు అందుబాటులో ఉన్నదని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందన్నారు.కేంద్ర బీజేపీ ప్రభ్యత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో గతంలో 15 రోజులకు ఒకసారి త్రాగునీటి సరఫరా జరిగేది.. కానీ నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందన్నారు.




