ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: నియోజకవర్గ పరిధిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దాదాపు రూ.5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయిం చారు. దానిలో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. పిండి పుల్లారెడ్డి కాలనీ నందు యూజీడి లైన్ల కోసం శంకుస్థాపన రూ.9 లక్షల రూపాయలు, సరస్వతి కాలనీ నందు యూ.జీ.డి.పైప్ లైన్ శంకుస్థాపన రూ.53 లక్షలు, అనుపమ నగర్ కాలనీ నందు యూ.జీ.డి.పైప్ లైన్ కొరకు శంకుస్థాపన అంచనా వ్యయం రూ.42 లక్షలు,గోకుల్ ఎంక్లేవ్ నందు యూ.జి.డి.పైపులైన్ల కొరకు శంకుస్థాపన.అంచనా వ్యయం రూ.18 లక్షల 55 వేలు, షిరిడి సాయినగర్ నందు యూజీడి పైపు లైన్ల కోసం శంకుస్థాపన అంచనా వ్యయం రూ.12 లక్షల రూపాయలు, ద్వారకానగర్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన అంచనా వ్యయం రూ.48 లక్షల రూపాయలు, హుడా భారతి కాలనీ నందు యూ.జీ.డి పైపులైన్ల కోసం శంకుస్థాపన అంచనా వ్యయం రూ.26 లక్షలు,ఇంద్రసేనారెడ్డి నగర్ నందు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన,హనుమాన్ నగర్ నందు సి.సి.రోడ్డు, యూ.జీ.డి.పైపు లైన్ల కొరకు శంకుస్థాపన.అంచనా వ్యయం. రూ. కోటి 40 లక్షలు,భూపేష్ గుప్తా నగర్ నందు గ్రేవ్ యార్డ్ కొరకు శంకుస్థాపన అంచనా వ్యయం రూ.47 లక్షల 50 వేలు రూపాయలు,సాయి ప్రకాష్ కాలనీ నందు సి.సి.రోడ్డు పనులకు వ్యయం రూ.76 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమ ని..నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్క టిగా పరిష్కారడం జరుగు తుందన్నారు. రూ.5 కోట్ల 40 లక్షల వ్యయంతో నియోజకవ అభివృద్ధి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు . ఈ సందర్బంగా పలు కాలనీ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి,శ్రీనివాస్ నాయక్, రంగుల కృష్ణ,డివిజన్ అధ్యక్షులు ఆందోజు సత్యంచారి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ రెడ్డి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్,మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి,శివారెడ్డి,నాగిరెడ్ డి,అనిత,పల్లం శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,మహిళలు,కార్యకర్తలు,పా ర్టీ అభిమానులు,వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రూ.5 కోట్ల 40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన





