రిమోట్‌ ఇవిఎంలను ప్రవేశ పెట్టిన ఇసి

  • వలస ప్రజలు నేరుగా వోటేసేలా సౌకర్యం
  • కొత్త ఇవిఎంలపై 16న అఖిపక్షంలో వివరణ

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌ప్రోటోటైప్‌ ‌రిమోట్‌ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. వలస వోటర్లు రిమోట్‌ ఈవీఎంలతో తామున్న స్వంత ప్రదేశం నుంచే వోటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ తెలిపింది. మల్టీ కాన్‌స్టిటుయెన్సీ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌మెషీన్‌ ‌ద్వారా..ఒకే పోలింగ్‌ ‌బూత్‌ ‌నుంచి వివిధ నియోజకవర్గాలకు వోట్లు వేసే సౌకర్యం ఉంటుంది. అయితే ఆర్‌వీఎం పనితీరును సవి•క్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శన ఇవ్వనున్నది. దీంతో స్వస్థలాలకు వెళ్లి వోటు వేసేందుకు ఇబ్బందులుపడుతున్న వారికి ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది.

ఈసీ కొత్తగా డెవలప్‌ ‌చేసిన రిమోట్‌ ఓటింగ్‌ ‌సిస్టమ్‌ ఉపయోగించి ఈ సమస్యకు చెక్‌ ‌పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్వీఎం ద్వారా ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లకుండానే వోటు వేసేలా ప్లాన్‌ ‌చేస్తుంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. జనవరి 16న రాజకీయ పార్టీలకు డెమో ఇచ్చేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిమోట్‌ ‌వోటింగ్‌ ‌మిషన్‌ ‌డెమోకు హాజరుకావాలని ఆహ్వానం పంపింది. లీగల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ‌టెక్నికల్‌ అం‌శాలను పరిగణలోకి తీసుకుని ఈ రిమోట్‌ ‌వోటింగ్‌ ‌సిస్టమ్‌ అమలుపై ముందుకెళ్లాలని ఈసీ భావిస్తుంది. దేశంలోని చాలా మంది వోటు వేసేందుకు సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

దీంతో చాలా మంది వోటింగ్‌కు దూరంగా ఉంటున్నారని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సమస్యలను అధిగమించేందుకు రిమోట్‌ ‌వోటింగ్‌ ‌సిస్టమ్‌ ఆలోచన చేసి మెషిన్‌ను డెవలప్‌ ‌చేసింది. ఈ కొత్త వోటింగ్‌ ‌మిషన్‌తో ఒక పోలింగ్‌ ‌బూత్‌ ‌నుంచి 72 వేర్వేరు నియోజకవర్గాలను కవర్‌ ‌చేసేలా రూపొందించారు. రాజకీయ పార్టీల అంగీకారం తర్వాత ఈ ఇష్యూపై ఈసీ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం వోటింగ్‌ ‌మాత్రమే నమోదైంది. అప్పట్లో దాదాపు 30 కోట్ల మంది వోటర్లు వోటింగ్‌కు దూరంగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది. వీరంతా బయటి ప్రాంతాల్లో స్థిరపడ్డ వారే అని, వీరు వోటింగ్‌లో పాల్గొనేలా ఈ రిమోట్‌ ‌వోటింగ్‌ ‌మెషిన్‌ను అభివృద్ధి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *