ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరటి భరత్ అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి రద్దు చేయడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని దీనికి నిరసనగా ఆమనగల్లు పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రహణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి కోకాపేట్ ప్రభుత్వ భూములు అమ్మడంలో ఉన్న శ్రద్ధ వైన్స్ టెండర్లపై ఉన్న శ్రద్ధ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంలో లేదని అన్నారు. అదేవిధంగా టిఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ ఘటనలోని నిందితులను అరెస్ట్ చేసి చైర్మన్ సెక్రటరీలను పదవుల నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, కొట్ర సురేష్, మొక్తల సాయి, తరుణ్ నాయక్, మల్లేష్, సుమన్ నాయక్, రాముల సాయి, శివ ముదిరాజ్, బద్రు నాయక్, సునీల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం




