రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

  • మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు
  • నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌

నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల రాజేందర్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఏర్పాటు చేసినప్పుడే కేసీఆర్‌కు తెలంగాణకు బంధం తెగిపోయిందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి కూడ బలుక్కుని మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌లో లేవనెత్తుతున్నారు. ఆ సెంటిమెంట్‌తో మళ్ళీ తెలంగాణ ప్రజల్ని కేసీఆర్‌ ‌మోసం చేయలేరని ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు.

కేసీఆర్‌ ‌ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావి•లు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల విద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్కదోవ పట్టిస్తుందని విమర్శించారు.  సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని గుజరాత్‌ ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామాన ప్రజా భరోసా యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర బైక్‌ ‌ర్యాలీని ఈటల ప్రారంభించారు. అనంతరం పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *