రాజుకున్న రాజకీయ వేడి
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్ విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు పాలమూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామయాత్రలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 14న రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొననున్నారు. మరుసటి రోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి రాహుల్ మాట్లాడే కార్యక్రమాన్ని పీసీసీ ఖరారు చేసింది. దీనికి రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఓయూలో వి•టింగ్‌ను ఎలాగైనా నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇవికాక తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ లంచ్‌కు ఏర్పాట్లు చేశారు. తర్వాత గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తమ నేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జన సవి•కరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీనియర్ నేతలు పని చేస్తున్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఎంవిఆర్ ఆర్టస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ధాన్యం సేకరణ అంశంపై గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభత్వుంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహభూబ్‌నగర్ బహిరంగ సభకు హాజరై ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులను మోసం చేస్తున్నదని ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రజలకు వివరించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.




