రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌

చంద్రబాబు నాయుడు రీట్వీట్‌
అమరావతి, అక్టోబర్‌ 17 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  రీట్వీట్‌ ‌చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌  ‌ట్వీట్‌ను బాబు  రీట్వీట్‌ ‌చేశారు. వైఎస్‌ ‌జగన్‌ ‌పాలనను కేంద్ర మంత్రులు కూడా గుర్తించారంటూ టీడీపీ అధినేత వ్యంగ్యంగా ట్వీట్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పాలసీలు చూసో… సాధించిన మంచి ఫలితాలు చూసో కాదు…

నరకం చూపుతున్న రోడ్లను చూసి కేంద్రమంత్రులు ట్వీట్‌ ‌చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రికి షేమ్‌గా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ…. ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *