రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లిలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌, ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *