రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం…సంపద లూటీ

  • ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత హామీలు
  • టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-1 ‌పరీక్షపై హైకోర్టు తీర్పు బిఆర్‌ఎస్‌కు చంపపెట్టు
  • దాచుకోవడం దోచుకోవడం మాత్రమే కేసీఆర్‌కు తెలుసు
  • యువత ఉసురు తీస్తున్న కేసీఆర్‌ ‌పాలన
  • కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి విమర్శ

కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌రాష్ట్రంలో వనరులు లూటీ అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. వనరులు, ఉద్యోగాలు పేదలకు చెందాలని సోనియా గాంధి  రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. మోసపూరిత హామీలతో  కేసీఆర్‌ ‌ప్రజలను మభ్య పెడుతున్నాడని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఖమ్మం జిల్లాకు తొలిసారి వొచ్చిన సందర్భగా సోమవారం జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…కెసిఆర్‌ ‌రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెట్టి రూ 5 లక్షల  కోట్ల అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు.  తొమ్మిదిన్నర సంవత్సరాలలో వనరులు, సాహజ సంపద మొత్తం లూటీ చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని అన్నారు.

ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రం మార్పుకు నాంది అని, జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, అది ఇంతకు ముందు కూడా నిరూపితమయిందన్నారు. జిల్లాలో మరో ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌కు తోడయ్యారని, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ మరింత బలపడిందన్నారు. గతంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీ పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డారని గుర్తుచేశారు. కార్యకర్తల కష్టం, చెమట వలనే నేడు కాంగ్రెస్‌ ‌ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నదన్నారు.రైతులకు వరికి క్వింటాకు మద్దతు ధరపై అదనంగా రూ 500 బోనస్‌ ఇవ్వాలని, ఎకరానికి రూ 15 వేల రైతు భరోసా ఇస్తామని గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ఆయన అభిలాషించారు. కాంగ్రెస్‌లోకి వొచ్చిన ప్రతి ఒక్కరికీ సాదరంగా స్వాగతం చెపుతూ అందరం కలిసి పని చేద్దామని ఆయన  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అనంతరం కాంగ్రెస్‌ ‌చేరికాల కమిటీ కో ఆర్డినేటర్‌ ‌పొంగులేటి మాట్లాడుతూ…కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని కోర్టులు తప్పు పట్టినా  రాష్ట్ర సంపదను దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే సీఎం కేసీఆర్‌ ఏకైక లక్ష్యగా పెట్టుకున్నారని విమర్శించారు.  కమీషన్ల కోసంమే తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టని పాలకులు బిఆరెస్‌ ‌నాయకులన్నారు. సంక్షేమం ముసుగులో తెలంగాణను సర్వం దోచుకుంటున్నారని ఆరోపించారు. ముందు ముందు నిరుద్యోగ యువతకు మంచి రోజులు వొస్తాయని, త్వరలోనే తీపి కబురు చెబుతానని, పొద్దునే టీవీలో ముందు వేచి చూడాలని 2022 మార్చ్‌లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ‌చెప్పారని, కానీ చేసిందేమీ లేదని గుర్తుచేశారు. నోటిఫికేషన్లు రిలీజ్‌ ‌చేసి రాష్ట్ర క్యాబినెట్లోని మనుషులతో యువత జీవితాలతో వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు.

పరీక్ష పత్రాలు అమ్ముతూ  ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని పొంగులేటి మండిపడ్డారు  న్యాయం అడిగితే నిరుద్యోగ యువతను అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తొత్తులకు ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగ యువతను బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుని ఆశ్రయించడంతో ధర్మాసనం కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని పొంగులేటి అన్నారు. ఐటీలో అగ్రస్థానంలోకి తెలంగాణ ఎగబాగుతుందని గొప్పలు చెప్పుకుంటున్న  బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం టెన్త్ ‌క్లాస్‌ ‌పిల్లల పేపర్లు సైతం లీక్‌ ‌చేస్తున్నారని, ఇదేనా ఐటీలో అగ్రస్థానం అంటే అని ప్రశ్నించారు. ప్రభుత్వ దాహానికి నిరుపేద యువత విద్యార్థులు బలి అవుతున్నారని విమర్శించారు వొచ్చేది ఇందిరమ్మ రాజ్యమని, కాంగ్రెస్‌ ‌మాటల ప్రభుత్వం కాదని, చేతుల ప్రభుత్వమని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పొంగులేటి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *