కొత్తగా 528 మందికి పాజిటివ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 08 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు కొద్ది హెచ్చుతగుతులతో నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 528 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 528 కొరోనా కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 196 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33 కేసులు, నల్గొండ జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 8,26,284 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,111గానే ఉంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,16,506 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,667గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.




