రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఎపి టుమారో సంస్థ ఆరోపించింది. చంద్రబాబుకు ‘న్యాయం అలన్యం అయితే న్యాయం తిరస్కరించినట్లే’ అనే సూత్రానికి బలవుతున్నారని, నిర్దోషి అయిన 73 సంవత్సరాల బాబును జైల్లో నిర్బందించి ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ కార్యదర్శి హేమ, సభ్యులు శ్రీదేవి, విజయలక్ష్మి, కవిత తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు ఏలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, ఆధారాలు లేవని, ప్రపంచంలోని 47 దేశాలలోని 20 వేల మంది అభిమానులు సుప్రీంకోర్టుకు సంతకాల ద్వారా విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ సంతకాలను ప్రతులను ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పిస్తామని వారు తెలిపారు. చంద్రబాబు ఒక విజనరీ, 14 సంవ్సరాలు సిఎంగా పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి విశేషమైన కృషి చేసి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఆయన్ని ప్రభుత్వం తన శక్తి యుక్తులను ఉపయోగించి వెంటాడి వేటాడుతుంటే, న్యాయ వ్యవస్థ బాబుకు అండగా నిలుస్తుందా? అని న్యాయస్ధానాలపై సామాన్యుడు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్దోషిని మన రాజ్యాంగం వ్యవస్థలు రక్షిస్తామన్న నమ్మకం ఈ కేసుని గమనిస్తున్న ప్రజలకు కలుగలేదన్నారు. చివరికి దేశంలోని అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడానికి నిరాకరించి వాయిదా వేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *