సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు పథకాన్ని సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూపాయలు 10 లక్షలు పోస్టర్ ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్, ఆసుపత్రి ఆర్ఎం డాక్టర్ సదానందంలతో కలిసి జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఆరోగ్య శ్రీ పథకం 2008 లో ప్రారంభమైంది.ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 5 లక్షల రూపాయల వైద్య సాయం పేదలకు పొందేది.ఈరోజు నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్యసాయం 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది.జిల్లాలో 9 ప్రైవేట్ ఆస్పతృలు,5 ప్రభుత్వ ఆసుపత్రిలో అమలవుతుంది.నిరుపేదలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 10 లక్షల రూపాయల వరకు ఖరీదైన కార్పొరేట్ వైద్య సేవలను కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పొందవచ్చు.ఈ పథకం జిల్లాలో అమలును ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కలెక్టరేట్ నుండి ప్రత్యేకంగా సమీక్షిస్తాము.పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.నిరుపేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఈ పథకం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు రేపటి నుంచి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామనీ అన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు పథకాన్ని సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్





