రాఘవ రాఘవ రాఘవ
మమ్మాదుకొనగ రావ
మనమున వజ్ర సంకల్పం
కరముల నీ సేవనం !
నీ అనుగ్రహం ఉంటే
ఆ మర్రి ఈ మర్రి ఏల
కష్ఠాల కడలిని లంఘించే
హనుమంతులం కాలేమా!
మీ ప్రభ వుంటే చాలదా
ఉడుత భక్తులం కామా
చదువుల కొలువుల
వెన్నెలై వెలగలేమా !
పాస్పోర్ట్ వీసాల
మోసాలెరుంగకుంటిమి
పని బాటల చదువుల
సంపాదన
నింపాది అనుకొంటిమి
అవసరాల వారిది కట్టి
పల్లే పట్నం అమెరికా జేరా
ట్రంప్ కంచే వేసే మోదీ
రాఘవ మాకేదారి!
– పి.బక్కారెడ్డి
9705315250





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల