రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇస్తా..

  • తప్పని తేలితే కరీంనగర్‌ ‌కమాన్‌ ‌వద్ద చెప్పుతో కొట్టుకోవాలి
  • డ్రగ్స్ ఆరోపణలపై  స్పందిస్తూ సవాల్‌ ‌విసిరిన మంత్రి కెటిఆర్‌
  • ‌బండి సంజయ్‌ అసలు మనిషా..
  • కరీంనగర్‌కు ఏంచేశాని అడిగాతే పెడబొబ్బలా..అంటూ ఘాటు విమర్శలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌బండి సంజయ్‌ అసలు మనిషా..పశువా..వానికేమైనా తెలివుందా…గావుకేకలు..పెడబొబ్బలు తప్ప కరీంనగర్‌కు ఏం చేశాంటే సమాధానం చెప్పడు అని అంటూ మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు చేశారు. తనపై పదేపదే డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌కు సవాల్‌ ‌విసిరారు. టెస్ట్ ‌కోసం తన రక్తం, గోర్లు, చర్మం కూడా ఇస్తా.. కిడ్నీ కూడా ఇస్తా ..టెస్ట్ ‌చేయించు కోవచ్చు..తాను సచ్ఛీలుడిగా బయటకు వచ్చాక..కరీంనగర్‌ ‌కమాన్‌ ‌వద్ద్ ‌బండి సంజయ్‌ ‌తనచెప్పుతోనే కొట్టుకోవాలన్నారు. కరీంనగర్‌ అభివృద్దికి ఏం చేశారని అడిగితే చెప్పకుండా గావు కేకలుపెడుతున్నాడని మండిపడ్డారు. ఆయన మనిషా పశువా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటిఆర్‌ ‌విడియాతో మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను తిడితే ఓట్లు రాలవు.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోండి.

పొద్దున లేస్తే బూతులు మాట్లాడటం తప్ప ఆయనకు ఏం తెల్వదు. వీళ్లు వచ్చిన తర్వాతే దేవుడికి మొక్కుడు నేర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ ‌నిజంగా రాజన్న భక్తుడు అయితే వేములవాడకు రూ. 100 కోట్లు ఎందుకు తేలేకపోతున్నాడు. మోదీ దగ్గర పలుకుబడి లేదా. అడగడానికి నోరు రాదా. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి, కొండగట్టు అంజన్న ఆలయానికి, జోగులాంబ ఆలయానికి, భదాద్రి రాముడికి, యాదాద్రికి నిధులు తీసుకురా అని సంజయ్‌కు కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. వేములవాడ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సభలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. మన ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన అభివృద్ధి గురించి చెప్పే శక్తి మన కేడర్‌కు ఉంది. సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. మన సెస్‌ ‌పరిధిలో 2014 వరకు 44 సబ్‌ ‌స్టేషన్లు ఉండేవి.. 8 సంవత్సరాల పరిపాలనలో మనం రూ. 51 కోట్లతో 34 కొత్త సబ్‌ ‌స్టేషన్లను నిర్మించాం. కొత్తగా ఐదు మంజూరు చేసుకున్నామని తెలిపారు. 65 ఏండ్లలో చేసిన అభివృద్ధి మనం 8 ఏండ్లలో చేసి చూపించామన్నారు.

మూలవాగుపై రూ. 62 కోట్లతో 13 చెక్‌ ‌డ్యాంలు నిర్మించామని తెలిపారు. రాజన్న గుడిని అభివృద్ధి చేస్తాం.. అది మా బాధ్యత అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఉత్తర కాశీకి నిధులు ఇచ్చారు. మరి దక్షిణ కాశీ అయిన వేములవాడకు ఎందుకు నిధులు ఇవ్వరు అని ప్రశ్నించారు. బీజేపీకి అబద్దాలు చెప్పడం మాత్రమే తెలుసన్నారు. పల్లె పలలెనా ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్టాల్ల్రో ఇవన్నీ ఉన్నాయా? అని అడిగారు. దేశంలో ఉత్తమ 20 గ్రామపంచాయతీల్లో..19 గ్రామపంచాయతీలు మన రాష్ట్రంలో ఉన్నాయని వాళ్లే అవార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. వేములవాడను కూడా సిరిసిల్ల స్థాయిలో అభివృద్ధి చేస్తా.. తనకు ఈ రెండు ఒక్కటే అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *