యోగాతో ఆరోగ్యం… ఆనందం : మంత్రి హరీష్ రావు సంకల్పం.. సిద్దిపేటలో వినూత్న యోగా కార్యక్రమం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆనందం వెళ్లి విరిస్తుంది , ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి వికసిస్తుంది.అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ మంత్రి హరీష్ రావు ముద్ర ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రమే కాదని ప్రజలు అనారోగ్యాలకు దూరంగా ఆనందంగా ఉండడమేనని రాష్ట్ర మంత్రి హరీష్ రావు వివిధ సభల్లో చెబుతుంటారు.ఇందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మంత్రి ఆశయానికి సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ వినూత్నంగా రూపొందించిన ఆనంద యోగ శిక్షణ శిబిరానికి కార్యరూపం ఇచ్చింది.
వార్డు వార్డు లో యోగా..
అందరికి ఆరోగ్యం అనే మంత్రి హరీష్ రావు ఆలోచన తో సిద్దిపేట పట్టణంలోని వార్డు వార్డు లో ఇంటింటికి ఉచితంగా యోగ విద్యను అందించి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండా లి అనే సంకల్పం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది . మంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రారంభమైన ఈ శిక్షణ శిబిరం క్రమక్రమంగా అన్ని వాడల్లోకి వెళ్తుంది.ఇందులో భాగంగా 22వ వార్డు నందు జూలై 10వ తేదీన ప్రారంభమైంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్, హరిప్రియ నగర్ నందు ప్రారంభించబడింది.కౌన్సిలర్ ఎడ్ల అరవింద్ రెడ్డి ప్రతినిత్యం శిక్షణకు హాజరవుతూ అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు.దాదాపు 100 మంది పురుషులు మరియు మహిళలు హాజరవ్వడం విశేషం ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు యోగా శిక్షణ కొనసాగుతుంది.. ఇలా అన్ని వార్డు ల్లో ప్రజలందరు యోగ చేసే విధంగా మంత్రి హరీష్ రావు కార్యరూపం దాల్చారు.
25 నుండి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో యోగ శిబిరం..
ఇప్పటికే 22వ వార్డు లో యోగ శిబిరం పూర్తి కాగా మరొక నూతన శిబిరం..
ఈ నెల 25న సిద్దిపేట లోని రైస్ మిల్లర్స్ భవన్ లో ఆనంద యోగ శిక్షణ శిబిరం ప్రారంభం కానున్నది. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, అమృతాహారం, ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిత్వ వికాసం లతోపాటు మనసు శరీరం ఆనందంతో నవ్వుతూ సాగిపోవాలని ఆశయానికి ప్రజల మద్దతు కూడా లభిస్తుంది.మంత్రి హరీష్ రావు ఉత్సాహంగా ఈ ఆనంద యోగ శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికి ప్రోత్సాహక బహుమతులను కూడా అందించడం విశేషం. ఈ అద్భుత ఆనంద యోగ ప్రయోగం మున్ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉన్నది . ఈ ఆనంద యోగ శిబిరంలో పాల్గొన్న వారు చిరునవ్వులతో బయటకు రావడం, సంతోషాన్ని వ్యక్తం చేయడం శిబిరం విజయవంతానికి ఒక నిదర్శనం.రాష్ట్ర యోగ అధ్యాయన పరిషత్ సభ్యులు, ప్రముఖ యోగశిక్షకులు తోట సతీష్ , తోట సంధ్యల నేతృత్వంలో ఈ ఆనంద యోగ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *