మౌనం ఓ నిశ్శబ్ద భావం
లిపిలేని విశ్వ భాషాతోరణం
అతిశక్తివంతమైన ప్రయోగం
ధార్మిక దైవత్వ మహాద్వారం
పాప పరిహార శాంతి యోగం !
వాక్కును నిరోధించే మార్గం
అపురూప ధ్యాన తపోఫలం
సహృదయ పరివర్తన మార్గం
మహోన్నత సద్గురు ఉపదేశం
ఇంద్రియ నిగ్రహ ధారణం !
దివ్యత్వ ఆరోగ్య ప్రసాదం
మనోశక్తుల వికాస సాధనం
అర్థాంగీకార సూచనం
సమాలోచనల సందర్భం
శక్తిని కూడగట్టుకునే క్షణం !
అసమాన నిశ్శబ్ద గుణం
అస్పష్ట తీర్పు అకాలం
వ్యతిరేకభావ వ్యక్తీకరణం
వ్యక్తిత్వ వెలుగుల వరం
మిత్రుల చిరకాల జ్ఞాపకం !
ఆకాశమంత నిగూఢార్థం
పలు అనర్థాల నివారణం
ఆత్మశాంతి నివాళి మంత్రం
భాషకే అందని సమాధానం
ఏకాగ్రత పునరేకీకరణం !
విషయ సంగ్రహణ మాద్యమం
మాట చెప్పలేని పరిష్కారం
సందిగ్ధ స్థితికే సంధికాలం
నిదానానికి అదో ప్రతిరూపం
దాంపత్య జీవితానికే వరం !
వెలకట్టలేని సద్గుణ ఆభరణం
అవరోధాన్ని దాటించే మార్గం
పదునైన ఆయుధం మౌనం
మౌన రాగాలు అతిమధురం
మహాత్ముల మనో జ్ఞాన జ్యోతి !
` మధుపాళీ 9949700037





