పక్కా తెలంగాణ వ్యతిరేకి…మోదీ ఏ మొహం పెట్టుకు రాష్ట్రానికి వొస్తున్నారు
గుజరాత్‌కు 20 వేల కోచ్ ఫ్యాక్టరీ…మాకేమో 520 కోట్ల వ్యాగన్ ఫాక్టరీ బిక్షం వేస్తున్నారా..?
విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చ లేదు
వరంగల్ టూర్‌కు మావారెవరూ వెళ్లరు
స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్
బిజెపిని, మోదీని ఎందుకు విమర్శించడంటూ రేవంత్‌ను ప్రశ్నించిన మంత్రి
బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఒక నెల జీతం జగదీష్, సాయిచంద్‌లకు ఆర్థిక సాయంగా అందజేస్తాం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : తెలంగాణ వ్యతిరేక ప్రధాని మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోమారు మండిపడ్డారు. అలాంటి ప్రధాని రాష్ట్ర పర్యటనకు వొస్తే తాము పాల్గొనబోమని ప్రకటించారు. రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. ప్రధాని మోదీ పర్యటనను బహిష్కరించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వొస్తున్న వార్తల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించి, బిఆర్ఎస్తో పోరాటమేనని ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో బిఆర్ఎస్ కూడా తన ప్రతిస్పందన తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ డియాతో మాట్లాడుతూ…ప్రధాని మోదీ తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వొస్తున్నారని విమర్శించారు. విభజన హాలను ప్రధాని మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకు మాత్రం 520 కోట్లతో వ్యాగన్ ఫాక్టరీనా. మాకేమైనా భిక్షం వేస్తున్నారా. ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా ఎందుకు వొస్తున్నారు. మేము ఎవ్వరం ప్రధాని కార్యక్రమానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నాం. రేపటి ప్రధాని కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం…ఎవ్వరం హాజరుకామని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాని మోదీని, బీజేపీని ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. ఎన్డీయే టింగ్‌కు బాబు ఎందుకు వెళతారో చెప్పాలి. మోదీతో దేశానికి ఏం మేలు చేసిండు.
రాహుల్ గాంధీని ఓ లీడర్‌గా దేశంలో ఎవరు గుర్తించలేదు. రాహుల్ గాంధీ ఏ హోదాలో హాలు ఇస్తున్నారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ ప్రెసిడెంటా. బహురూపు వేషాలు వేస్తే ప్రజలు నమ్మరు. రాహుల్ గాంధీ ముత్తాత గురించి కూడా ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. వొచ్చేవారం రోజుల్లో సీఎం కేసీఆర్ మేధావులతో సమావేశం నిర్వహిస్తారని..కామన్ సివిల్ కోడ్ ద చర్చ జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో గాడ్సే దూరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయన్నారు. ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయన ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రాహుల్ హోదా ఏంటని నిలదీశారు. కుసుమ జగదీశ్ అకాల మరణం ఎంతో బాధించిందని, సాయిచంద్ మరణం పార్టీకి ఎంతో తీరని లోటన్నారు. ఇద్దరి అకాల మరణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కలత చెందారని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు పార్టీ ప్రజాప్రతినిధుల నెల జీతం అందజేస్తామని చెప్పారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తున్నామని వెల్లడించారు.




