ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కడ్తాల్ మండల తహసిల్దార్ షేక్. ముంతాజ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని నివారించవచ్చునని వర్షాలు మెండుగా కురుస్తాయని తద్వారా సాగునీరు, తాగునీరుకు ఇబ్బందులు ఉండవని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం దగ్గర ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, మల్లయ్య, బిక్షపతి, గణేష్, ఏఎంసి డైరెక్టర్ లాయఖ్ అలీ, నాయకులు యాదగిరి రెడ్డి, రామచంద్రయ్య, మంకీ శ్రీను, రామచంద్రారెడ్డి, వెంకటయ్య గౌడ్, గందరాములు, అశోక్ రెడ్డి, జల్కం రమేష్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.



