ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : మైసిగండి మైసమ్మ సన్నిధిలో ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోలి శ్రీనివాస్ రెడ్డి బుధవారం మైసమ్మ ను దర్శించుకుని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోలి శ్రీనివాసరెడ్డి ని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మ సన్నిధిలో కొద్దిసేపు గడిపారు. అనంతరం ఆలయ సిబ్బంది గోలి శ్రీనివాస్ రెడ్డికి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, చంద్రశేఖర్ రెడ్డి, సతీష్, కిరణ్, శ్రీరామ్, నాగిళ్ల తిరుపతయ్య, సుమన్ నాయక్, శ్రీకాంత్, శేఖర్, మణికంఠ, మాదారం మహేష్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.



