ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన కశిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం మైసిగండి మైసమ్మ దేవాలయంలో అమ్మ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి తల్లి మృతి చెందారు. విషయం తెలిసి ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి తలకొండపల్లి మండలం కర్కస్ తాండకి చెందిన కెతావత్ బాలు మృతి చెందారు. మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి తక్షణ ఆర్ధిక సహాయం రూ.3,వేలు అందించారు. ఆయన వెంట టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్ అలీ, బిక్యా నాయక్, హీరా సింగ్, భాస్కర్, శేఖర్ గౌడ్, యాట నర్సింహ, జహంగీర్ బాబా పాల్గొన్నారు.
మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి




