సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: 2014 ఎన్నికల ప్రచారంలో షాద్ నగర్ ఎన్నికల బహిరంగ సభలు కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో వచ్చిన నాలుగు నెలల లోపు అమలు చేసి తీరుతామని కెసిఆర్ వాధా చేశారు. రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న రిజర్వేషన్ పై స్పందించకపోవడం చాలా దారుణం అని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మిర్జా, జమీల్ బేగ్, మున్నా తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలలో మైనార్టీలకు తక్కువ చూపే చూస్తుంది కేవలం ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించి అందులో రెండు ఓడిపోయే తమ మిత్రపక్షమైన ఎంఐఎం పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం చూస్తేనే మైనార్టీ లకు కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది.గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హామీ ఇవ్వకపోయినా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి తద్వారా చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోటానికి అవకాశం లభించింది అలాగే చాలామంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు దూరం అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ వైపు మైనార్టీలు మొగ్గు చుపుతూన్నరన్ని గ్రహించి మైనార్టీ బందు పేరుతో కొత్త రాజకీయ క్రీడ ప్రారంభించాడు.మైనార్టీ మిత్రులారా ఒకసారి ఆలోచించండి మనకు రంజాన్ తోఫా మైనార్టీ బందులతో మన బతుకులు మారుతాయా రిజర్వేషన్ కల్పించిన యెడల మన ఓటు ఆయుధంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ని గద్దె దించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.



