మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 9: దావుత్ ఖాన్ గూడ భూమి వివాదంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డిపై బీజేపీ బిఏంసి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని బిఏంసి కాంగ్రెస్ ప్లో లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బాలింగని జంగయ్య హితవు పలికారు. గురువారం మల్లపుర్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, ఎర్ర జైహింద్, నాయకులు గట్టు బాల కృష్ణ, టేకుల సుధాకర్ రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి, ప్రవీణ్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్ రెడ్డి, జంగయ్య మాట్లాడుతూ.. దావత్ ఖాన్ గూడ దళితుల భూమి విషయంలో మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి స్కెచ్ వేసి, కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి, దళితులకు భూమి చెందకుండా చేసినట్లు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి మాట్లాడం మంచిది కాదన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భూమి కేటాయించాలని చేసిన తీర్మానంలో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారన్న విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు, బలహీనవర్గాల వైపు ఉంటుందన్నారు. దళితులకు భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ దళితుల వైపు ఉంటుందని, దావత్ ఖాన్ గూడ మిగిలిన భూములను దళితులకు ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి మిగిలిన పూర్తి భూమిని దళిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో దళితులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ ముందుండి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



