మేము పార్టీ మారడం లేదు

సమస్యలపై చర్చకు సిఎం రేవంత్‌తో భేటీ

ఉమ్మడి మెదక్‌ జిల్లా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వివరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఖండిరచారు. మంగళవారం సీఎంను కలిసి నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌ రావు మంగళవారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఒకేసారి నలుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడంపై ఆసక్తి నెలకొంది. వారు పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై తెలంగాణ భవన్‌లో బుధవారం విూడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని.. కేసీఆర్‌ వెంటే ఉంటామని చెప్పారు. ప్రొటోకాల్‌ కోసం, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌ని కలిసినట్టు వివరణ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా విూడియా సమావేశంలో వెల్లడిరచారు. తమ నాయకుడు కేసీఆర్‌ నాయకత్వంతో పూర్తి విశ్వాసంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ గడ్డ అని, ఆ నమ్మకంతోనే 10 స్థానాల్లో 7 చోట్ల బీఆర్‌ఎస్‌ను గెలిపించారని ఆమె అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తామని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆమె ఖండిరచారు. మా పార్టీ నాయకత్వానికి మా విూద ఎలాంటి అపనమ్మకం లేదు. కానీ గందరగోళం సృష్టించాలనే ప్రయత్నంతో ఈ ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి నలుగురు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వబోతున్నారని వార్తలు వొస్తున్నాయి. అలాంటిదేవిూ లేదు. ఎవరికీ వివరణ ఇవ్వడం లేదు. మాపై పార్టీకి నమ్మకం. మాకు కూడా పార్టీపై నమ్మకం, గౌరవం ఉన్నాయని సునీతా లక్ష్మా రెడ్డి తెలిపారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నానని, ఎవరికీ వివరణ ఇవ్వడానికి రాలేదని, ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తమ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఎలాంటి గందరగోళానికి గురికావొద్దన్నారు. దురుద్దేశంతో లేనిపోని మాటలు చెప్తున్నారని, అప్రతిష్ఠపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, సీఎం నిన్న ప్రోటోకాల్‌, మాకు ఎస్కార్ట్‌, పైలెటింగ్‌ ఇవ్వడంలేదని చెప్పాం. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎంతో మాట్లాడామని సునీతా లక్ష్మారెడ్డి వివరించా30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, తామే చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారు పార్టీ మారుతున్నారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *