మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్‌ ‌దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వొస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్‌, ఆయన కుమారుడు అంకిత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో క్రేన్‌ ‌సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌  ‌దవాఖానకు తరలించారు. తౌర్యా నాయక్‌ ‌గతంలో నార్సింగి మండలం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా వ్యవసాయ ప్రాథమిక సహకారం సఘం(ఖంఅ••) చైర్మన్‌గా, నర్సంపల్లి ఎంపీటీసీగా కూడా ఎన్నికయ్యారు. టైరు పగలడంతోనే కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *