ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చనిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బాబ్రీ, అంజమ్మ, ప్రవీణ్ కుటుంబాలకు ఒక్కొక్కరి కుటుంబాలకు రూ.5వేల చొప్పున రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు జోగు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్ నరసింహ, లాయక్ అలీ, పిఎసిఎస్ డైరెక్టర్ సేవ్య నాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, శారద పాండు నాయక్, వార్డు సభ్యులు రామచంద్రయ్య, శ్రీను నాయక్, బిఆర్ఎస్ మండల నాయకులు గంప శ్రీను, హర్యనాయక్, కంబాలపల్లి అంజి, జంగయ్య, ఇర్షాద్, కృష్ణ, శ్రీకాంత్, శ్రీను , శ్రీశైలం, భాస్కర్, రాజు, సక్రు నాయక్, రాములు, పాండు, చందర్, భాను తదితరులు పాల్గొన్నారు.




