మృగశిర మురువాలి

ఏరువాక సాగాలి

శిరముతో దుక్కి దున్ను

బసవన్నలకు

శిరము వంచి మొక్కు

మృగశిర తెచ్చు చల్లని

వర్ష పవనం

తగ్గించు ఊష్ణ తాపం

మృగశిర నాడు తిను

ఇంగువ బెల్లం

జలుబూ, సర్దులకు బల్లెం

మృగశిర కురిస్తే

ఏరువాక మెరుస్తుంది

ముసలెద్దు రంకె వేస్తుంది

మఖ గర్జిస్తే

సస్య లక్ష్మి పులకించు

రైతన్న హర్షించు

సేద్యం –

భారత దేశ సౌభాగ్యం!

– పి.బక్కారెడ్డి, 9705315250

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *