మునుగోడు ఓటమితో తీవ్ర నైరాశ్యంలో బీజేపీ ..!

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నిక ఏదైనా కేసీఆర్‌ ‌వ్యూహామే.టీఆర్‌ఎస్‌ ‌రెండుసార్లు అధికారంలోకి రావడానికి కేసీఆర్‌ ‌వ్యూహాలే విజయానికి కారణం. రాజకీయాలన్నాక ఎన్నికల్లోనే కాదు, ప్రతి వ్యవహారంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు పోవలసి ఉంటుంది.ఈ దేశం సర్వమత సంగమం,బీజేపీ తన రాజకీయ అవసరాలకోసం హిందువులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతుంది.తెలంగాణ భిన్న మతాల నిలయం.అన్న విషయాన్ని జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తన బోధనతో జ్ఞానోదయం చేశారు.ఎగ్జిట్‌ ‌పోల్స్ అన్నీ ముందే తేల్చేశాయి. మునుగోడు ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వానికి ఆశ్చర్యంతో పాటు అదనంగా దిగ్భ్రాంతి కూడా ప్రాప్తించింది. రాజ్యాంగ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని అతిరథ మహారాజులనీ,సమస్త బలగాలని మోహరించి , ఎమ్మెల్యే లకు ఏర వేసి చివరి నిమిషందాకా శతవిధాల ప్రయత్నించి,ఊహ గానాల గణాంకాలకు మించిన మాయాజాలం తమ వద్ద ఉన్నదని భ్రమించిన నాయకులు తెలంగాణాలో ఆవిష్కరితమైన గంగా,జమునా, తెహజీబ్‌ ‌చేతిలో బందీలుగా చిక్కుకున్నారు.ఇక భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అఖండ విజయం దేశాన్ని ఆశ్చర్యంలో ముంచాయి.చైతన్యవంతమైన మునుగోడు ఓటర్లు బీజేపీ గూబ గుయ్‌ ‌మనిపించారు.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఉత్తేజం ఆశాభావం పొందిన వారి సంఖ్యకు లెక్కలేదు.కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు అయితే తమకు ప్రాప్తించింది శూన్యము అని గ్రహించకుండా గెలిచింది తామేనన్న చిత్తభ్రాంతిలోకి వెళ్లిపోయారు.వాండ్ల ఉద్దేశ్యం అదికాదు.బీజేపీ గెలిస్తే తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌ఖాళీ అవుతుందన్న భయం. భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఇష్టపడని వారు, ఆ పార్టీ పాలనలో ప్రజలు కష్టపడుతున్న తీరును చూసిన వారు,ఆ పార్టీ తీరు ప్రమాదకరమైన కోవలోకి వెళుతున్నదని భయపడుతున్న వారు ,పజాస్వామ్య వాదులందరికీ కేసీఆర్‌ ‌వ్యూహం మునుగోడు తీర్పుతో అపరిమిత ఆనందాన్ని కలిగించాయి.వారందరూ కేసీఆర్‌ ‌గెలుపులో తమ గెలుపును చూసుకున్నారు. కొందరయితే విజయాన్ని సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోని 2023 గురించి, కేంద్రంలోని 2024 గురించి మాట్లాడసాగారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మునుగోడు మాత్రం మౌనం పాటిస్తుందా? అనూహ్యంగా తెచ్చిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీని టిఆర్‌ఎస్‌ ఓడించిన తీరు..మునుగోడు ప్రయోగం దేశవ్యాప్తంగా అమలు చేయగలమా ? కేసీఆర్‌ ‌నాయకత్వంలో బిఆర్‌ఎస్‌ ‌పాగా వేస్తుందా ? మీడియాలో ఇవే చర్చలు పత్రికల్లో ఇవే వ్యాసాలు అత్యంత ఖరీదు అయినా ఉప ఎన్నికగా సంచలనం సృష్టించిన మునుగోడు ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలకు జ్ణ్జానోదయం కల్పించింది.

దేశం ఇప్పుడున్న స్థితిగతుల నుంచి చూసినప్పుడు టిఆర్‌ఎస్‌ ‌విజయం కీలకమైనది,ఎంతో ఆవశ్యకతమైనది.పార్టీ సానుభూతిపరులకు కూడా ఈ రుచించని రీతిలో సాగుతున్న విద్వేష రాజకీయాల వేగానికి ఈ పరిణామం కనీసం కళ్లెం వేస్తుంది. తీవ్ర జాతీయవాదం,  మనోభావాల జూదం వీటి ద్వారా ప్రజలను మభ్యపెట్టడం అన్నివేళలా సాధ్యపడదని గ్రహిస్తే, దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను,నిజమైన పద్ధతుల ద్వారా ఎదుర్కోనడానికి ప్రయత్నించవచ్చు.కేసీఆర్‌ ‌నాయకత్వంలో  తీవ్ర జాతీయవాద ఏజెండాను, విభజన రాజకీయాలను తన ఆచరణరంగం నుంచి మినహాయించి కొన్ని కీలక అభివృద్ధి అంశాల మీద కేంద్రీకరించింది. ఈ అంశాలు సంక్షేమానికి, సదుపాయాలకు సంబంధించినవి. స్థూలంగా ఆర్థికమైనవి. మనోభావాలను మనోభావాలతోనే ఎదిరించాలన్న వాదనని గానీ, ఎదుటివాడు ఆరంభించే సంచలనాత్మక వివాదములో భాగస్వామీ అయ్యే ఆత్మహత్య సదృశ్య సరళిని గానీ కేసీఆర్‌ ఆమోదించలేదు.ఉత్తర తెలంగాణలో కాకతాళీయంగా జిమ్మిక్కులతో, అసత్య ప్రచారంతో బీజేపీ, కాంగ్రెస్‌ అపవిత్రమైన పొత్తుతో దుబ్బాక, హుజురాబాద్‌ ఉప పోరులో గెలిచి ప్రాబల్యం లేని మునుగోడులో బిజెపి కకావికలం అయింది. 2018లో రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటె రాజకీయ చైతన్యం తొణికిసలాడే మునుగోడు నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్‌ ‌వైపు ఉన్నారు. సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్‌ ‌పది మంది ప్రశాంత్‌ ‌కిషోర్‌ (‌పీకే) లకు సమానం.సామాన్య ప్రజలు మెగాస్టార్లకు, పవర్‌ ‌స్టార్లకు, సూపర్‌ ‌స్టార్లకు ఎలాగైతే అభిమానులుగా ఉంటారో.. అంతటి క్రేజ్‌ ‌సంపాదించిన కేసీఆర్‌ ‌కు  రాజకీయ పార్టీల అభిమానుల వెల్లువ ఎక్కువే. ఎన్నిక ఏదైనా ‘‘కారు దే జోరు’’ మునుగోడు ఘన విజయం కేసీఆర్‌ ‌వ్యూహనికి ప్రతిరూపం. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ,‌గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో బీజేపీ  బండారాన్ని ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ ‌రూపంలో సిద్ధం అయ్యింది.బీజేపీ ముఠాధిపతులనుండి  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్న వేళ..జాతీయ రాజకీయాల్లోకి దూకిన కేసీఆర్‌ ‌నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి బోణి కొట్టింది. మునుగోడు గెలుపు సాధారణమైనదేమీ కాదు.దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యం దానికి ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు కనిపిస్తున్న హడావుడి మాత్రం దేశ రాజకీయాలలో అవరించి ఉన్న శూన్యాన్ని మాత్రమే సూచిస్తున్నది. ఏ ఒక్క చిన్న అలంబన దొరికిన చాలు,ఓట్ల వరదకు  ఎదురీదవచ్చుననే ఆశ, ఒక విజయం, ఒక ఊరట,ఒక సానుకూల సంకేతం లేని చీకటి కాలంలో ఏదైనా ఒక వెలుతురు కిరణం దొరికినట్టు సంబరపడి పోతున్నారు. గత రెండేళ్లలో దుబ్బాక, గ్రేటర్‌ ‌హైద్రాబాద్‌,‌హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి రాష్ట్రాలను కోల్పోతూ  మిశ్రమ ఫలితాలు వస్తున్న భారతీయ జనతా పార్టీ దాని శ్రేణులు మునుగోడు ఫలితం వల్ల నిస్త్రాణకు లోనయింది.మునుగోడు ఉప ఎన్నిక ఫలితం గురించి మదనపడనవసరం లేదని సమాధానం పడతారా చూడాలి.మునుగోడు ఎన్నికల్లో అమిత్‌ ‌షా చాణక్యం,నడ్డా ఎత్తుగడ  దారుణంగా ఘోరంగా ఓడిపోయిందనేది మాత్రం పచ్చి నిజం.సమాజాన్ని ఏదో ఒక ప్రాతిపదికపై విడదీసి ఆ విభజన నుంచి లబ్ధి పొందాలనే  రాజకీయం అన్నిచోట్ల విజయం సాధించలేదని మునుగోడు ఫలితం ఋజువైంది,ప్రతిసారి హిందుత్వం పేరుతొ మతాల అస్త్రాన్ని ప్రయోగించడం భావ దారిద్య్రం పుష్కలంగా సూచిస్తుంది తప్ప ఫలితాన్ని ఇవ్వదని బిజెపి మేధావి వర్గం గ్రహించాలి. బిజెపి పాచికలను పారనివ్వని కేసీఆర్‌ ‌వ్యూహాన్ని చూసి మొండిరోగానికి ఔషధం కనుక్కున్నంత ఆనందం ప్రత్యర్థులకు సైతం కలుగుతున్నది.బీజేపీ నేతలకు పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది.వారిది భావ దారిద్య్రమే.టిఆర్‌ఎస్‌ ‌నుంచి నేర్చుకోవాలని కాదు దాన్ని అనుకరించాలని చూడడం గమనార్హం.
image.png
డా।। మల్లేశ్వర్‌ ‌సంగాని
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *