ముక్కోటికి ముస్తాబవుతున్న భదాద్రి

  • 23 నుండి జనవరి12 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
  • 1వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం…2న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం
  • నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన  భద్రాచలం శ్రీ సీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా రంగులతో  తీర్చిదిద్దుతున్నారు. 23వ తేది శుక్రవారం నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 12వ తేది వరకు అధ్యయనోత్సవాలు మిధుల స్టేడియంలో, కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారు దశవతారాలలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 23వ తేది శుక్రవారం నాడు మత్య్సావతారం, 24వ తేదీ శనివారం కూర్మవతారం, 25వ తేది ఆదివారం వరహావతారం, 26వ తేది సోమవారం  నరసింహవతారం, 27వ తేది మంగళవారం వామనావతారం,  28వ తేది బుధవారం పరశురామారవతారం, 29వ తేది గురువారం శ్రీరామావతారం, 30వ తేది శుక్రవారం బలరామావతారం, 31వ తేది శనివారం శ్రీకృష్ణావతారం, 1వ తేది కల్కి అవతారములో భక్తులకు  దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం  మిధుల స్టేడియం అంతా  సుందరంగా తీర్చిదిద్దారు. చాందిని వస్త్రాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలు అలంకరించారు. 1వ తేది   ఆదివారం గోదావరి నదిలో  తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసారు. స్వామివారు గోదావరి నదిపై విహరించే హంసవాహానాన్ని కూడా  సిద్ధం చేస్తున్నారు. అలాగే  తెల్లవారుజామున జరిగే  వైకుంఠ ద్వారదర్శనానికి  ఏర్పాట్లు  చేస్తున్నారు. సమయం దగ్గర పడటంతో అధికారులు  పనులను వేగవంతం  చేసారు. ప్రధానాలయాలతో పాటు అనుబంధ దేవాలయం అయిన  పర్ణశాల  ఆలయాన్ని కూడా  సర్వాంగ సుందరంగ  తీర్చిదిద్దారు.  భక్తులు  ఎటువంటి ఇబ్బందులు పడకుండా  తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శరం కార్యక్రమాలను భక్తిశ్రద్దలతో తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిధుల స్టేడియంలో  శుక్రవారం జరిగే  అద్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు  మత్య్సావతారంలో  భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు
దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా స్వామివారు  దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 23వ తేది నుండి జనవరి 12 తేది వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు  స్వామివారు ‘‘మత్య్సావతారం’’లో భక్తులకు దర్శమిస్తారు.
విశిష్టత : శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాలో మొట్టమొదటి అవతారం మత్య్సావతారం ఈ అవతారానికి సంబంధించిన రెండు గాథలు పురణాల్లో  ఉన్నాయి. ఒకటి జ్ఞాన విధులైన వేదాలను బ్రహ్మ నుండి అపహరించి సముద్రంలో దాగివున్న సోమకాసురుని సంహరించడానికై మత్య్సావతారం ధరించి  వేధాలను ఉద్దరించడం జరిగింది. రెండవది జలప్రళయం నుండి  నావలో ఉన్న  వైవస్వత మనువులు, సప్తరుషులును, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషదాలను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించుట వలన కేతు గ్రహ బాధలు తొలగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *