తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: మా పూర్తి మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తామని, బీసీ రిజర్వేషన్లపై స్పందించని జాతీయ పార్టీలకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యు లు రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కమార్ నియోజకవర్గ బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ.బిసి సంఘం మద్దతు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కే నని బిసి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. . బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశానుసారం బలమైన ప్రాంతీయ పార్టీల అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని ఆదేశాల మేరకు స్థానికంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్నికల్లో తమ పూర్తి మద్దతును ప్రకటించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి బీసీ నాయకులమంతా కలిసికట్టుగా కృషి చేయనున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై స్పందించని జాతీయ పార్టీ లైన బిజెపి, కాంగ్రెస్ లకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది లేదని అన్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణాయను కలిసి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు తాండూర్ లొ బిఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాండూర్ లో బీసీల కొరకై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 2 ఎకరాలలో బిసి ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి రూ 2 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. తాండూరు ప్రాంతం లో సరైన , బలమైన నాయకుడు బిసి వ్యక్తి లేకపోవడం తో అందరివాడు అయిన పైలట్ రోహిత్ రెడ్డి కే వ్యక్తి గతంగా మా బిసి సంఘం మద్దతు ఉంటుందన్నారు.చట్ట సభలలో 50 శాతం బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని, జనగణన తో పాటు కుల గణన చేపట్టాలని, కేంద్రం లో బిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరితే జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు స్పందించక పోవడం దురదృష్ట కరమన్నారు. మహిళా బిల్లులో కూడా ఓబీసీ లకు రిజర్వేషన్ పెట్టేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ కవితని కలిసి ఆర్ కృష్ణయ్య కోరారాన్నరు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బిజెపి మాటలు నమ్మశక్యంగా లేవని , అలాంటివారు ఒక బలమైన బీసీ నేత అయిన బండి సంజయ్ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఎందుకు దింపేశారో సమాధానం చెప్పాలని అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు గడప గడపకు వెళ్లి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సయ్యద్ షుకుర్ , జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, తాండూర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ నాయి కోడి జ్యోతి, తాండూర్ మండల్ బీసీ సంఘం అధ్యక్షులు బసంత్, యాలాల్ మండల్ బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారి, పెద్దమొల్ మండల్ బీసీ సంఘం అధ్యక్షులు శ్రావణ్, బషీరాబాద్ మండల్ బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రజక సంఘం జిల్లా కన్వీనర్ కృష్ణ, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరమేష్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఘాజీపూర్ వీరన్న, కుమ్మరి సంఘం నాయకులు శంకర్, రాజ్ పుత్ సంఘం నాయకులు బాలాజీ, అజిత్ బీసీ సంఘం మహిళా నాయకులు అనిత, విజయలక్ష్మి, బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, రమేష్, జుంటుపల్లి వెంకట్, శివ, సాయి, అజయ్, బంటు సంజయ్, బంటు అనిల్, సాయిలు రమేష్, నగేష్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మా మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే





