మా దేశం దివాలా తీసేసింది

సియోల్‌కోట్‌, ‌ఫిబ్రవరి 20 : ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ ‌త్వరలోనే దివాలా తీయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ దేశం దివాలా తీసేసిందంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దివాలా తీసిన పాకిస్థాన్‌లోనే మనమంతా బతుకుతున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి దేశ రాజకీయ, సైనిక, పరిపాలనా వ్యవస్థలే కారణమని నిందించారు. సియోల్‌కోట్‌లో ఓ కార్యక్రమంలో ఆసిఫ్‌ ‌మాట్లాడుతూ ఽపాకిస్థాన్‌ ‌దివాలా తీయనుందని మీరు వినే ఉంటారు. కానీ ఇప్పటికే తీసేసింది. మనం దివాలా తీసిన దేశంలోనే బతుకుతున్నాం’’ అని చెప్పారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ‌సంస్థను దేబిరించడం వలన పాక్‌కు ప్రయోజనం లేదని ఆసిఫ్‌ అన్నారు. ఽసమస్యకు ఐఎంఎఫ్‌ ‌దగ్గర పరిష్కారం లేదు. మన దేశంలోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. గతంలో పరిపాలించిన ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రభుత్వాన్ని ఆసిఫ్‌.. ఉ‌గ్రవా దులతో పోల్చారు. ఽరెండున్నరేళ్ల క్రితం మనం ఉగ్రవాదులను అధికారంలోకి తెచ్చాం. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులకు వారే కారణం’’ అని ఇటీవల దేశంలో పాక్‌ ‌తాలిబన్లు జరుపుతున్న దాడులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *