సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 19: అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన 4 గురు సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు చిన్నకోడూర్ కానిస్టేబుల్ పరుశరాములు కుకునూరు పల్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్,గౌరారం కానిస్టేబుల్ శ్రీనివాస్, ఏ ఆర్ కానిస్టేబుల్ శ్రీరామ్
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి,లో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప, ఆర్విఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ కు మొత్తం నలుగురికి మరియు పాపకు అత్యవసరంగా O పాజిటివ్, ముగ్గురికి,బి పాజిటివ్ ఒక్కరికి బ్లడ్ అత్యవసరము ఉన్నదని ఆసుపత్రి వర్గాల నుండి సమాచారం అందుకున్న పై కానిస్టేబుళ్లు వెంటనే స్పందించి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి యొక్క కుటుంబ సభ్యులు అత్యవసరం సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంవత్సరంలో ఈరోజు వరకు 217 యూనిట్ల రక్తం ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నామన్నారు.




