ఆహ్వానించిన మాజీ ఏఎంసీ చైర్మన్.
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ గృహప్రవేశానికి ఆహ్వానించారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హైదరాబాద్లోని బండ్లగూడలో నిర్మించిన ఈనెల 19న జరిగే నూతన గృహప్రవేశానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి గురువారం తాండూరు పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.





