మాజీ ఎంపీ మల్లు రవిని సన్మానించిన నేతలు

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 25 : టి పి సి సి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఆమనగల్లు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య, ఆమనగల్లు మాజీ ఎంపిటిసి గుర్రం కేశవులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లురవికి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు పథకాలను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *