కందుకూరు,నవంబర్ 6: మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం లభిస్తుందని కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దంతోజి నరసింహాచారి పేర్కొన్నారు.సోమవారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్,బిజెపి పార్టీలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు పలుకుతున్నారని వారికి ప్రజాదరన లేక ఓటమి భయంతో పరుగులు పెడుతున్నారని ఆయన తెలిపారు. బిఆర్ఎస్,బిజెపి ఒక్కటేనని ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.
మహేశ్వరంలో కాంగ్రెస్ కు సునాయస విజయం





