మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04:మహేశ్వరం నియోజక వర్గంలో భారీ మెజార్టీతోకమలం జెండాఎగరవేస్తామని, అన్ని వర్గాల ప్రజలు
బి.జే.పి. అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. శనిబి.కె.పి.ని ఆదరిస్తున్నారనివారం మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఛత్రపతి శివాజీవిగ్రహానికి నివాళులు అర్పించి. తెలంగాణ అమరవీరుడు సిరిపురంయాదమను స్మరించుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.నాగారం, పడమటి తాండ, నాగిరెడ్డిపల్లి, అబీబుల్లా గూడ, గొల్లార్చిన్న తూపు, పెద్దమ్మతాండ, మాణికమ్మగూడ గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్ణహించారు. ఈ సందర్భంగా అందెల ప్రణములుమాట్లాడుతూ మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ఇండ్ల మండల ప్రజలకు పంపిణి చేయకుండా పాతబస్తే ప్రజలకురోహింగాలకు పంచడంపై మంత్రి సబితారెడ్డిని నిలదీయాలనిపిలుపునిచ్చారు. దళిత బంధు పథకం కేవలం బి. ఆర్.ఎస్. నాయకులు, కార్త కర్తలకే దక్కడంతో గ్రామాల్లో ఆరుబాటు మొదలైందని నిరుపేదలంత కమలానికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.విద్యాశాఖ మంత్రి మహేశ్వరం లో ఎంతమందికి కొలువులు ఇచ్చిందోచెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ప్రచారంలో బీజేపీ సీనియర్ నాయకులు బస్వ పాపయ్య గౌడ్, కొలన్ శంకర్ రెడ్డి, కడారి జంగయ్య, జీఎస్ సుదర్శన్ రెడ్డి, అనంతయ్య గౌడ్, కన్వీనర్ దేవేందర్ రెడ్డి, అధ్యక్షులు మాధవాచారి, కుండె వెంకటేష్, మహేందర్ ముదిరాజ్, కుమార్, శ్రీశైలం, దేశా నాయక్,రఘుపతి, సర్పంచ్ లు, ఎం పి టి సి లు ,బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా సహా ఎస్సీ, ఎస్టీ మోర్చాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో కమలం జెండా ఎగరవేస్తాం





