మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్‌ ‌మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి  నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు. మహిళా కూలీలు పాటపాడగా వారితో కలిసి కొద్దిసేపు ఎమ్మెల్యే గొంతు కలిపారు. అనంతరం సాగు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కరెంట్‌, ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి తమ సమానంగా నాటు వేసిన పద్మాదేవేందర్‌రెడ్డి పనితనానికి కులీలు మురిసిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *