మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:  మహిళలు స్త్రీనిధి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొందిన రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. కడ్తాల మండలములో గురువారం మండల అధ్యక్షురాలు జంగమ్మ, ఏపీఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షిక మండల మహిళా సమైక్య సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా  ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఐటమ్స్ తయారు చేయాలని, రెడీమెట్ గార్మెంట్ తదితర ఉపయోగించాలని సూచించారు. మహిళల ఆర్థిక బలో పేతం కోసం వారు తయారు చేసిన వస్తువులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కోశాధికారి వసంత, కడ్తాల్ సర్పంచ్ లక్ష్మి నర్సింహా రెడ్డి, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి డీఎం కృష్ణ, వివిధ గ్రామాల సీసీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *