మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్
‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా విధంగా పోస్టులు పెడుతున్నారని వెల్లడించారు. సునీల్‌ ‌కార్యాలయం నుంచే పోస్టింగ్‌లు వొస్తున్నాయని అన్నారు.

రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా పోస్టులు పెడుతున్నారని జాయింట్‌ ‌సీపీ అన్నారు. మహిళల ప్రతిష్టకు భంగం కలిగించారనే కేసులు పెట్టామని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చట్టప్రకారమే నడుచుకున్నామని స్పష్టం చేశారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్‌ ‌చేయలేదని అన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *