ఆ కలం
కాలాన్ని గురిచూస్తు
ప్రశ్నించే ఆయుధం…..
ఆ భాష
గుండెలో రక్తాన్ని
ఊగించే ఆవేశం…..
ఆ అక్షరం
చీకటిలో అగ్గిలా
వెగిలే పోరాటం….
ఆ కవితే
తెలుగు నుదుట
ఓ ప్రస్థానం…
ఆ కవిదే
ఆంధ్రుల పాలిట
మహాప్రస్థానం….
ఆ జయభేరే
ఆధునికతకు
నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం..
అతడే
మహా కవితకు శ్రీకారం
మహా అడుగుకు ఆకారం.
– శ్రీ సాహితి, 9704437247




