మహానీయుల ఆశయ సాధనకు కృషి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06:మహానీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రికె.సి.ఆర్ పెద్ద పీట వేసి భావన నిర్మాణల కోసం స్థలాలు కేటాయిస్తునట్లురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిపేర్కొన్నారు.శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం గ్రామ పరిధిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ,బాబు జగజీవన్ రామ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మట్లాడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ సచివాలయంగా నామకరణం చేసి, భారీ విగ్రహాన్నీ ఏర్పాటు చేసి వారి స్పూర్తితో  ముందుకు వెళ్తున్నారన్నారు.సమాజంలో అందరూ సమానంగా ఎదగాలని దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.అంబేద్కర్ ,బాబు జగజీవన్ రామ్  అడుగుజాడల్లో నడుస్తూ మహేశ్వరం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం, బి ఆర్ ఎస్ నాయకులు ఎస్ ఆనందం, రావుగళ్ల బాబు, సంజీవ,రవి కుమార్,తొంట రవి,ఎం నవీన్, పెయ్యాల కుమార్,బాలయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *