మస్కట్‌ ‌విమానంలో సంకాతేక లోపం

తిరువనంతపురం, జనవరి 23 : తిరువనంతపురం నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఐఎక్స్ 549 ‌నంబరు గల ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌ ‌కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8:30గంటలకు మస్కట్‌కు బయలు దేరింది.

అయితే గాల్లోకి ఎగిరిని కాసేపటికే విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్‌..‌లట్‌ను ఉదయం 9:17 గంటల సమయంలో తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్‌ ‌చేశారు. ఆ సమయంలో విమానంలో 105 మంది ప్రయాణికులు, క్యాబిన్‌ ‌సిబ్బంది ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌ ఇం‌డియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *