- తెలంగాణలో నీ పప్పులు ఉడకవ్
- చంద్రబాబుపై హరీష్ రావు సహా మంత్రుల మండిపాటు
- కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు మంత్రి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. మావోయిస్టుల పేరుతో యువకులను కాల్చి చంపించారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ దోపిడీకి గురైందని విమర్శించారు. ఆంధప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని హరీష్ రావు వాఖ్యానించారు.
బుధవారం చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి, మాట్లాడిన తీరుపై హరీష్ రావు స్పందిస్తూ…ఏదో ఉద్దరించానని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. ప్లోరోసిస్ లేకుండా చేశానని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తుందన్న మంత్రి హరీష్ రావు..ఇతర రాష్ట్రాలు తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాయని చెప్పారు. రైతుల కోసం కల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే..అవి తప్పని రూ.150కోట్లు వాపస్ ఇవ్వాలని కేంద్రం అడుగుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం మాత్రం చేపల కోసం కల్లాలు ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది..గానీ పంటలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రైతులపై ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. రైతుల కోసం కొత్త చట్టాలు తెచ్చి 750 మందిని పొట్టపెట్టుకున్న చరిత్ర బీజేపీదేనని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం నష్టం కలిగిస్తుందని అన్నారు. రేపు అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కల్లాలు ఎందుకు కట్టొద్దో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హావి• పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. ఉపాధి హావి• కూలీలకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు రూ.50వేల కోట్లకుపైగా కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కల్లాలు ఏర్పాటు నిషేధాన్ని మానుకోవాలన్నారు.
ఇక జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వ్యక్తి చంద్రబాబు అని, ఇప్పుడు ఎందుకు వొచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య ముసుగులో ఇక్కడ డిస్ట్రబ్ చేయడానికి చంద్రబాబు వొచ్చారని ఆరోపించారు. అయన హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను వేధించాడని చెప్పారు. ఆయన వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. తమ వి•దికి ఇప్పటికే 5 మందిని వదిలారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారు. అంగన్ వాడీలపై లాఠీ చార్జి చేయించింది కూడా చంద్రబాబేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. తెలంగాణకు అడ్డుపడి వేల మంది చావుకు చంద్రబాబు కారణం అయ్యారన్నారు. దమ్మున్న నాయకుడు తమ వెనక వున్నాడని ప్రజలు అనుకుంటున్నరన్న మంత్రి… చంద్రబాబు మాయలో పడరని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ నడవవని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. టిడిపి మాయలో పడడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్దంగా లేరని అన్నారు.
ఖమ్మం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్నిఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అని అనుకున్న మళ్లీ రిజెక్ట్ చేస్తారని కవిత పేర్కొన్నారు.




