కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 09: మంత్రి మల్లారెడ్డి గెలుపు తధ్యమని ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు కౌకుంట్ల రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్, రెండోసారి ఎమ్మెల్యేగా మల్లారెడ్డి విజయం ఖాయమని అన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే నాయకులను ప్రజలు నమ్మరని తెలిపారు. బిఆర్ఎస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ బి ఆర్ఎస్ నాయకులు నాగరాజు, త్యాగరాజు పాల్గొన్నారు.
మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం





