కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను బుధవారం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు. దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన పాలన అందిస్తుందని అన్నారు. ఆయనను కలిసిన వారిలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మర్యాదపూర్వక కలయిక




