మరోసారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి కొనసాగిస్తా 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి కొనసాగిస్తా అని ప్రజలను యాదన్న కోరినారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందినాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.కొమరబరండ గ్రామంలో రామక్కపాటకు ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి సర్పంచ్ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి మహిళలు చింధులు వేచినారు.షాబాద్ మండలోని కొమరబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ…కొమరబండ గ్రామంలో పెద్ద సమస్య వాగు ఈ వాగుపై వంతెన ఐదు కోట్లతో నిర్మించుకొనెందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు రైతుబంధు రైతు బీమా,బిసి బంధు దళిత బంధు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ వికలాంగ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ మైనార్టీ లోన్స్ ప్రకృతి వనాలు వైకుంఠధామాలు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలో తదితర సంక్షేమ పథకాలను అందించినది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్ భూములను పట్టా భూములుగా మారుస్తామని హామీ ఇచ్చారు.18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు 3000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోను వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో వున్నా అంశాలకు మించినా అభివృద్ధి చేస్తామని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చేతల్లో చూపించే ప్రభుత్వమని అన్నారు.ఈ సారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు,బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు,గ్రామ నాయకులు, గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *