మమ అనిపించిన కందుకూరు మండల సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 21 : కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాడి వేడిగా కాకుండా మమ అనిపించారు.మండల పరిషత్ అధ్యక్షురాలు మంద జ్యోతి పాండు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేవలం 7 మంది ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచ్ లు,పలు శాఖల అధికారులు కొందరు మాత్రమే హాజరై సమావేశాన్ని మమ అనిపించారు. మొదటగా వ్యవసాయ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది అనంతరం విద్యుత్తు,ప్రాథమిక విద్య,ప్రాథమిక ఆరోగ్య, పశుసంవర్ధక శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ,డిఆర్డిఏ,మహాత్మా గాంధీ జాతి ఉపాధి, సామాజిక అడవుల పెంపకం,ఉద్యానవన కార్యక్రమాల పట్ల చర్చ జరిగింది. సమావేశంలో అధికారులు తూతు  మంత్రంగా ఎజెండాలో ఉన్న అంశాలను చదివి మమ అనిపించారు.మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు 32 మంది గైర్హాజరయ్యారు.మరో ఏడు మంది ఎంపీటీసీలు కూడా గైరాజరయ్యారు. పూర్తిస్థాయిలో ప్రజా ప్రతినిధులు లేక సమావేశం వెలవెల పోయింది.సమావేశంలో లేమూరు,ముచ్చర్ల ఎంపీటీసీలు మాత్రమే అధికారులను కొంతమేర ప్రశ్నలు అడగడం జరిగింది.ఈ క్రమంలో పెద్దమ్మ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ సుమన్ నాయక్ మండల సమావేశంలో తాము అడిగిన సమస్యలపై నేటికీ తీర్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేయగా ఎంపీడీవో వెంకట్ రాములు కల్పించుకుని పెద్దమ్మ తండాలో ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి జరగలేదని ఎలా అనుకుంటారని తెలపడంతో నేటికీ తాను 300 మంది విద్యార్థులకు బస్ పాసుల కోసం డోనరుగా నిలిచి వారికి పాసులు అందించడం జరిగిందని అప్పటినుండి తమ గ్రామానికి బస్సులు వస్తున్నాయని ఆయన సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కల్పించుకొని మీగ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారు కదా మీ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారా అని అడగడంతో తమ గ్రామంలో పూర్తి అభివృద్ధి పనులు తాము చేయడం పట్లనే గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని మమ్మల్ని ఎవరు ప్రశ్నించ లేక పోతున్నారని ఆయన తెలిపారు.లేమూరు ఫారెస్ట్ మండలంలో అతిపెద్దదని తమ గ్రామం పేరు ఎందుకు ఎత్తడం లేదని లేమూరు ఎంపీటీసీ యాదయ్య ఫారెస్ట్ అధికారిని అడగగా గతంలో జరిగిన అవి కాకుండా నూతనంగా వచ్చిన వాటిలో నర్సరీలు మొక్కలు నాటడం తడితర కార్యక్రమాలు గుమ్మడవెల్లి,మాదాపూర్,పులిమామిడి తడితర గ్రామాల్లో చేశామని ఆయన వివరణ ఇచ్చారు.దీంతో ఎంపీటీసీ మాట్లాడుతూ,ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను అటవీ ప్రాంతంలో కాకుండా ఎక్కడ మేపుకోవాలని ఆయన అధికారులు నిలదీశారు.యాదవులు గొర్రెలు మేపుతున్న సమయంలో అటవీ అధికారులు గొర్రెలను పట్టుకొని తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు.దీంతో అధికారి స్పందిస్తూ ప్లాంటేషన్లో గొర్రెలు మేపుతున్న యాజమాన్యాల వద్ద వారికి హెచ్చరికలు జారీ చేస్తూ తాము వాటిని తీసుకు వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఫారెస్ట్ ఏరియాలో గడ్డి ఏపుగా పెరగడంతో వాటిలోని గొర్రెలను మేపుతున్నారని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన అనడంతో మొక్కలు పెరిగిన అటవీ ప్రాంతంలో మాత్రమే గొర్రెలు మేపి మేపుకోవాలని వారికి తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,మహేశ్వర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,ఎంపీడీవో వెంకట్ రాములు,సూపరిండెంట్ రెహమాన్, ఏపీవో రవీందర్ రెడ్డి,ఏపీఎం కవిత,ఎంఈఓ మధుసూదన్ రెడ్డి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పద్మావతి,డాక్టర్ హరినాథ్,పశువైద్యాధికారి డాక్టర్ రేవతి, సిడిపిఓ హాల్టికల్చర్ అధికారి సౌమ్య ఎంపీటీసీలు సురసాని రాజశేఖర్ రెడ్డి,ఎల్లారెడ్డి,రాజమ్మ,యాదయ్య,కాకి రాములు,కో ఆప్షన్ సభ్యులు సులేమాన్,సర్పంచులు యలాల శ్రీనివాస్,సుమన్ నాయక్,పల్లె వసంత కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *