ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ నియమితులైన గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గోలి శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మంత్రికి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.




