తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి , పెద్దేముల్ మండల జెడ్పీటీసీ సభ్యులు ధారా సింగ్ తదితరులు ఉన్నారు.




