హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార, పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె అశోక్ రెడ్డి, డైరెక్టర్ బి రాజమౌళిలు పుష్పగుచ్చం, మెమెంటోలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే అదనపు సంచాలకులు కె నాగయ్య, సిఐఈ రాధాకృష్ణ, జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ , ఆర్ఐఈ రాములు, ఉప సంచాలకులు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ, ప్రసాదరావు, సురేష్, మీడియా అకాడమీ సెక్రెటరీ వేంకటేశ్వర రావు, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.




