మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైనం
భోపాల్, జూలై 3 : మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్‌లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేవా పరిధిలోని జివులా గ్రామానికి చెందిన సుమిత్ర మిశ్రా(40), భరత్ మిశ్రా భార్యా భర్తలు. కాగా, సుమిత్ర గత నెల 30వ తేదీన మరణించింది. అయితే ఆమె మరణ వార్తను భర్త ఎవరికీ తెలపలేదు. భార్య మృతదేహాన్ని ఒక ఫ్రీజర్‌లో ఉంచాడు. ఈ క్రమంలో సుమిత్ర మరణ వార్త ఆమె సోదరుడు అభిరాజ్ కు జులై 2వ తేదీన తెలిసింది. అతడు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.

దీంతో పోలీసులు భరత్ మిశ్రా ఇంటికి వెళ్లి చూడగా.. సుమిత్ర మృతదేహం ఫ్రీజర్‌లో కనిపించింది. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, తన సోదరి మృతిపై అభిరాజ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన సోదరిని ఆమె భర్త భరత్ కొట్టి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరిని భర్త చాలా కాలంగా వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే, భరత్ మాత్రం.. తన భార్య అనారోగ్యం కారణంగా మరణించిందని చెబుతున్నాడు. తన భార్య జాండీస్‌తో బాధపడుతోందని.. ఈ క్రమంలోనే జూన్ 30న చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ముంబైలో ఉన్న తమ కుమారుడు వచ్చేంత వరకు భార్య మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లు వివరించాడు. అయితే మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.